ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై సోమవారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని, చెల్లుబాటయ్యే, చెల్లుబాటు కాని ఓట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి కల్పించాలని, కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా లెక్కింపు సాగేలా సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ హాలుకు బయటే ఆహారం, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాల్లో రౌండ్లు, వార్డుల వారీగా బ్యాలెట్‌ బాక్సులను క్రమబద్ధంగా వేరు చేసి లెక్కింపునకు సిద్ధం చేయాలని, కౌంటింగ్‌ సిబ్బందికి ముందస్తుగా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించకుండా భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి అంశాన్ని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫలితాల ప్రకటనకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement