ఉక్కుపాదమేదీ? | - | Sakshi
Sakshi News home page

ఉక్కుపాదమేదీ?

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ఉక్కుపాదమేదీ? నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో.. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

న్యూస్‌రీల్‌

చివరి రోజంతా అక్రమ నిర్బంధాలే..

జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కళ్ల ముందే ప్రజాస్వామ్యం ఖూనీ నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ మూకల గూండాయిజం పోలీసుల సమక్షంలోనే దాడులు.. నామినేషన్‌ పత్రాల చించివేత ఆయుధాలతో పట్టుబడినా కేసులు నమోదు చేయని ఖాకీలు జిల్లా కేంద్రంలోనే అదుపుతప్పిన శాంతిభద్రతలు

పల్నాడు
ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
‘పచ్చ’ మూకలపై
ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా నిలవాల్సిన అధికార యంత్రాంగం పాలక పార్టీకి దాసోహమైంది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాల్సిన పోలీసులే పచ్చ నేతలకు అండగా నిలిచారు. అధికార దర్పానికి అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారులు మౌనం వహించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఘటనలు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

I

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.6 వేలు, గరిష్ఠ ధర రూ.9,500, మోడల్‌ ధర రూ.8 వేల వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.5261 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ డైరెక్టర్‌, మాజీ డీజీ, ఐపీఎస్‌ పి.వి కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం దర్శించుకున్నారు.

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

చిలకలూరిపేట: ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఏఎంజీ జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాన్ని శనివారం మున్సిపల్‌ అధికారులతో కలసి పరిశీలించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రంలో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి శ్రీహరిబాబు, మున్సిపల్‌ డీఈఈ షేక్‌ అబ్దుల్‌ రహీం, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

2 నామినేషన్లు తిరస్కరణ

నరసరావుపేట: జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి సంజనా శ్రీహర్ష అభ్యర్థుల సమక్షంలో శనివారం నామినేషన్ల పరిశీలన చేశారు. బొల్లాపల్లి, నాదెండ్లకు చెందిన రెండు నామినేషన్లు తిరస్కరించారు. స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ మొత్తాన్ని జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు కన్నబాబు జిల్లాలో పర్యటించారు. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. స్క్రూటినీ కేంద్రాలవద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

నరసరావుపేట టౌన్‌: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చ గూండాలు దాడులకు పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారన్న ఫిర్యాదులపై సమర్థంగా చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులు స్వేచ్ఛగా తమ పత్రాలను సమర్పించే పరిస్థితులు ఉండాలి. కానీ, పల్నాడు జిల్లా కేంద్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు గుంపులుగా చేరి బెదిరింపులకు దిగారు. మారణాయుధాలతో భయాందోళనలు సృష్టించారు. అయినప్పటికీ అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా అధికారులు చేయలేదు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా, వాటిని నిలువరించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.

జిల్లా కేంద్రంలోనే ఈ దుస్థితి

కలెక్టర్‌, ఎస్పీ సహా జిల్లా ఉన్నతాధికారులందరూ అందుబాటులో ఉండే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఎన్నికల ప్రక్రియ అప్రతిష్ఠపాలవడం ఆందోళన కలిగిస్తోంది. నామినేషన్‌ కేంద్రాలకు సమీపంలోనే ఘర్షణలు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే, ఇక మారుమూల మండలాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కేవలం సమీక్షలకే పరిమితమైంది.

ఆయుధాలతో తిరిగినా కేసుల్లేవు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులు చేసేందుకు టీడీపీ గూండాలు ఓ వాహనంలో మారణాయుధాలు తరలిస్తూ పట్టుబడ్డారు. గురువారం ఆర్డీవో కార్యాలయ నామినేషన్‌ కేంద్రానికి వెళ్లే దారిలో, మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఓ వాహనంలో కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు నింపారు. అవసరమైనప్పుడు వాటిని బయటకు తీసి నామినేషన్లు వేయడానికి వచ్చే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి ఆ వాహనాన్ని సీజ్‌ చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా, పిడుగురాళ్ల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన పెద్ద లక్ష్మారెడ్డి, భారతి దంపతులపై టీడీపీ గూండాలు రెండు రోజుల క్రితం దాడులకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలపై వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసులు విమర్శలకు తావిస్తున్నాయి. దాడులకు పాల్పడింది టీడీపీ మూకలేనని తెలిసినా, ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు నమోదు చేయలేదు. గుర్తుతెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేసి, కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్లుగా పోలీసుల వ్యవహారం ఉండటంతో విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

కలెక్టర్‌, ఎస్పీ తీరుపై విమర్శలు

నామినేషన్‌ కేంద్రాల వద్దకు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ, ప్రెస్‌మీట్లతో సరిపెట్టారు. అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసేలా చూడటం యంత్రాంగం ప్రాథమిక బాధ్యత. దానిని ఎంతవరకు నిర్వర్తించారన్న దానిపై కలెక్టర్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసు శాఖకు అత్యంత కీలకమైనా నామినేషన్‌ కేంద్రాల వద్ద దాడులు జరుగుతున్నప్పుడు ఎస్పీ కనిపించకుండా, చివరి రోజున ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు గుంపులుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నా, చూసీచూడనట్లు వ్యవహరించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎస్పీ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఇప్పటికైనా స్పందించాల్సి ఉంది.

గత రెండు రోజులుగా నామినేషన్లు వేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చివరి రోజైన శుక్రవారం అవకాశం కల్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, అర్ధరాత్రి నుంచే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను స్టేషన్‌లో నిర్బంధించారు. సాయంత్రం వరకు బయటకు రాకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాన్ని దెబ్బతీశారు. చివరి రోజు కీలకమైన సమయంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తమ నామినేషన్లు ఎలా వేయాలని అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులకు భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులే పాలకుల మెప్పు కోసం అక్రమ అరెస్టులకు ఒడిగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement