మద్యం మత్తులో స్కూల్‌ బస్సు డ్రైవింగ్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో స్కూల్‌ బస్సు డ్రైవింగ్‌

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన వైనం త్రుటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేటటౌన్‌: డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడపడంతో స్కూల్‌ బస్సు ప్రమాదానికి కారణమైన ఘటన మండలం పరిధిలో జరిగింది. తాతపూడి గ్రామ పరిధిలో శనివారం సాయంత్రం మార్టూరు నుంచి హైవేపై చిలకలూరిపేట వైపునకు వస్తున్న క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఘటనలో బస్సులోని విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు ముందుభాగంతో పాటు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీహర్షిణి విద్యాసంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరంకు చెందిన బస్సు డ్రైవర్‌ భూక్యా రాంబాబు నాయక్‌ను బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో అతడు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. బస్సుల ఫిట్‌నెస్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలని, డ్రైవర్ల ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement