మాజీ మంత్రి విడదల రజినికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి విడదల రజినికి పరామర్శ

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

మాజీ మంత్రి విడదల రజినికి పరామర్శ

చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజినిని వైఎస్సార్‌ సీపీ జిల్లా నాయకులు శనివారం పరామర్శించారు. మూడు రోజులుగా హౌస్‌ అరెస్టులో ఉన్న రజినిని బయటకు రాకుండా రూరల్‌ ఎస్‌ఐ లేఖా ప్రియాంక తోసి వేయడంతో గాయపడిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి శనివారం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి నివాసానికి వచ్చి, ఆమెను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై మాజీ మంత్రి విడదల రజిని వారితో మాట్లాడుతూ ఎస్‌ఐ ప్రియాంక దురుసుగా నెట్టివేయడంతో కిందపడి నడుముకు దెబ్బలు తగలడంతో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. కిందపడిన సందర్బంలో పార్టీ కార్యకర్త వచ్చి తలకు చేతులు అడ్డం పెట్టడంతో ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన దౌర్జన్యాల గురించి మాజీ మంత్రిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement