పిడుగురాళ్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు చిక్కులు | - | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు చిక్కులు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

పిడుగురాళ్ల/ మాచవరం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. నామినేషన్‌ కేంద్రాల వద్దకు అనుకూలమైన మీడియా వారు తప్ప మిగిలిన వారికి అనుమతి ఇవ్వలేదు. పోలీసుల బారికేడ్ల వద్ద కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఉండి జర్నలిస్టులని చెప్పినా పంపించలేదు. పిడుగురాళ్ల పట్టణంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్యాలయం, శివాలయం వద్ద ఎంపీపీ స్కూల్‌ నామినేషన్‌ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ దారులన్నీ కూటమి నాయకులు, వారి అనుచరులతో నిండిపోయాయి. కమ్మ కల్యాణ మండపంలో వందల సంఖ్యలో కూటమి నాయకులు ఉండి నామినేషన్‌ కేంద్రాల వద్దకు వైఎస్సార్‌సీపీ వారు రాకుండా అడ్డుకున్నారు. రెండు కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు టెంటులు వేయించి వంటలు కూడా వండి వడ్డించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మూకలను తరలించారు. అధికారులకు సైతం ఇక్కడి నుంచే భోజనాలను టీడీపీ నాయకులు తీసుకెళ్లడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement