దాచేపల్లిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

దాచేపల్లిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నిర్బంధం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

● స్థానిక ఎన్నికల వేళ పేట్రేగిన కూటమి నేతలు ● వైఎస్సార్‌ సీపీ నేతలు, అభ్యర్థులకు బెదిరింపులు ● నిస్సిగ్గుగా వత్తాసు పలికిన పోలీసులు ● నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు

● స్థానిక ఎన్నికల వేళ పేట్రేగిన కూటమి నేతలు
● వైఎస్సార్‌ సీపీ నేతలు, అభ్యర్థులకు బెదిరింపులు

దాచేపల్లి: దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ డమ్మీ అభ్యర్థులుగా బరిలో ఉన్న షేక్‌ సుభాని, కొప్పుల రామకృష్ణలు ఎక్కడ ఉంటే పోలీసులు అక్కడికి వెళ్లి వేధింపులకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కరు కూడా నామినేషన్‌ వేయడానికి వీల్లేదని కూటమి నేతల నుంచి ఒత్తిడి ఉండటంతో పోలీసులు ఆ దిశగా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ వార్డు అభ్యర్థులు బొమ్మిరెడ్డి నరసింహారావు, మునగా శ్రీనివాసరావు, బత్తుల బయ్యన్న, వేల్పుల ధర్మదేవ్‌ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది ఊరు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. బయట ఉన్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి, వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ ఇంటి పరిసరాలను ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు వైపు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. రవికుమార్‌ తమ్ముడు రామకృష్ణ ఇల్లు వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు మందపాటి రమేష్‌రెడ్డి, బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, మునగా పున్నారావు, కోట కృష్ణ, షేక్‌ జాకీర్‌హుస్సేన్‌ తదితర నేతలు కూడా ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఇనుప కంచెలు అడ్డుగా వేశారు. వైఎస్సార్‌ సీపీ నేతల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. మాచవరం, కారంపూడి పోలీస్‌ స్టేషన్ల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement