అతివలే కీలకం | - | Sakshi
Sakshi News home page

అతివలే కీలకం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికం అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వారిదే హవా

జిల్లాలో పురపాలికల వారీగా వివరాలు...

నగర పంచాయతీలు

పుర పోరులో

సత్తెనపల్లి: జిల్లాలో మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. గెలుపు, ఓటముల్లో కీలకం కానున్నారు. పురుషుల కంటే మహిళల ఓట్లు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అన్ని చోట్ల మహిళలు ఓట్లు ఎక్కువగా ఉండటంతో వారి ఆశీస్సులకోసం నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లాలో నామినేషన్‌ దాఖలు సందర్భంగా నిర్వహించిన బలప్రదర్శనలోనూ కొందరు అభ్యర్థులు మహిళల మద్దతును కూడగట్టుకోవడం విశేషం. జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలతో పాటు గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో 3,38,294 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,796 మంది మహిళలు. 1,61,429 మంది పురుషులు. 69 మంది ఇతరులు ఉన్నారు. పురుషులకంటే మహిళలు 15,367 అధికంగా ఉన్నారు. ఎన్నికల నిర్వహించనున్న 5 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో మహిళల ఓట్లు ఎక్కువగా ఉండటంతో వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది. పోలింగ్‌ సందర్భంలోనూ మహిళల ఓటింగ్‌ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ఓట్లు రాబట్టుకుంటే తమ విజయం సునాయాసం అనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ప్రచారంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

మున్సిపాలిటీ వార్డులు బూత్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు

చిలకలూరిపేట 48 96 40,589 45,946 19 86,554

వినుకొండ 36 69 22,815 24,366 05 47,186

సత్తెనపల్లి 36 72 23,223 24,968 05 48,196

మాచర్ల 36 71 22,069 24,445 06 46,520

పిడుగురాళ్ల 40 68 26,364 28,575 16 54,955

గురజాల 23 69 10,746 11,936 02 22,684

దాచేపల్లి 28 54 15,623 16,560 16 32,199

మొత్తం 247 499 1,61,429 1,76,796 69 3,38,294

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement