గ్రామీణ ప్రతిభకు వెలుగుల వేదిక | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రతిభకు వెలుగుల వేదిక

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

గ్రామీణ ప్రతిభకు వెలుగుల వేదిక ● రగ్బీ అండర్‌–14 బాలబాలికలకు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ స్కూల్‌, అచ్చంపేట. ● థాంగ్‌ తా, ఉషు, మల్ఖాంబ్‌ ఆటలు అండర్‌–14, 17, 19 బాలబాలికలకు ఈ నెల 28న శారద హైస్కూల్‌, చిలకలూరిపేట. ● టేబుల్‌ టెన్నిస్‌ అండర్‌–14, 17 బాలబాలికలకు ఈ నెల 30న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, దుర్గి. ● గట్కా అండర్‌–14, 17, 19 బాలబాలికలకు అక్టోబర్‌ 1న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (సుగో), సత్తెనపల్లి. ● రెజ్లింగ్‌ / కుస్తీ అండర్‌–14, 17 బాలబాలికలకు అక్టోబర్‌ 3న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, కారంపూడి. ● రెజ్లింగ్‌ / కుస్తీ అండర్‌–19 బాలబాలికలకు అక్టోబర్‌ 4న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, కారంపూడి. ● తైక్వాండో అండర్‌–14, 17 బాలబాలికలకు ఈ నెల 28న గుంటూరు బీఆర్‌ స్టేడియం. ● టెన్నిస్‌, స్క్వాష్‌, సాఫ్ట్‌ టెన్నిస్‌ అండర్‌–14, 17 బాలబాలికలకు ఈ నెల 28న ఎక్స్‌ట్రీమ్‌ టెన్నిస్‌ అకాడమీ, అమరావతి రోడ్‌ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, గోరంట్ల. ● హ్యాండ్‌బాల్‌ అండర్‌–14, 17, 19 బాలబాలికలకు ఈ నెల 30వ తేదీన ఎన్టీఆర్‌ స్టేడియం, తెనాలి. ● బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ అండర్‌–14, 17 వారికి ఈ నెల 30న ఎన్టీఆర్‌ స్టేడియం, తెనాలి. ● రగ్బీ అండర్‌–17 బాలబాలికలకు అక్టోబర్‌ 1న అరవింద పాఠశాల, కుంచనపల్లి, తాడేపల్లి మండలం. ● జూడో అండర్‌–14, 17 బాలబాలికలకు అక్టోబర్‌ 1న జిల్లా పరిషత్‌ స్కూల్‌, పెనుమాక, తాడేపల్లి మండలం.

ఎంపికలకు షెడ్యూల్‌ ప్రకటించిన ఎస్‌జీఎఫ్‌ మారుమూల ప్రాంత విద్యార్థులకు సువర్ణావకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుంచి ఎంపికలు

పిడుగురాళ్ల రూరల్‌ /సత్తెనపల్లి: పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు కీలకం. ఈ సత్యాన్ని మరోసారి రుజువు చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) క్రీడా సమరానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఫేజ్‌–1కు రంగం సిద్ధమైంది. మారుమూల పల్లెల్లోని మట్టి మైదానాల నుంచి జాతీయ స్థాయి వేదికల వరకు విద్యార్థులను తీసుకెళ్లే ఈ ప్రక్రియ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

గ్రామీణ క్రీడాకారులకు అవకాశం

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) మోగిస్తున్న గంట.. పల్నాటి గ్రామీణ విద్యార్థుల పాలిట నిజమైన వరంలా మారనుంది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సహజమైన నైపుణ్యాలు, పట్టుదల మెండుగా ఉంటాయి. సరైన వసతులు, ఖరీదైన కోచింగ్‌ లేక వెనుకబడుతున్న వీరికి ఎస్‌జీఎఫ్‌ పోటీలు చక్కటి రాజమార్గం వేస్తున్నాయి. మండల స్థాయి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం.. జాతీయ స్థాయి పోటీల వరకు అత్యంత పారదర్శకంగా సాగుతుంది.

పలు క్రీడాంశాల వైవిధ్య వేదిక

ఈ ఏడాది ఏకంగా 46 విభిన్న క్రీడాంశాల్లో (అథ్లెటిక్స్‌, టీమ్‌ గేమ్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ తదితర విభాగాల్లో) అండర్‌–14, 17, 19 వయసుల వారీగా పోటీలు హోరాహోరీగా జరగనున్నాయి. కేవలం కొన్ని సంప్రదాయ ఆటలకే పరిమితం కాకుండా, విభిన్న రంగాల్లో గ్రామీణ విద్యార్థులు సత్తా చాటేందుకు ఇది అరుదైన అవకాశం. ప్రతి దశలోనూ నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులు అందించే సాంకేతిక మెలకువలు క్రీడాకారులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి.

28 నుంచి ఎస్‌జీఎఫ్‌ ఫేజ్‌–1 ప్రారంభం

పల్నాడు జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుంచి ఎస్‌జీఎఫ్‌ ఫేజ్‌–1 ప్రారంభం కానుంది. వేదికలను కూడా ఖరారు చేశారు.

గుంటూరు జిల్లాలో ఇలా...

ఈ నెల 28వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ ఫేజ్‌–1 ప్రారంభం కానుంది. వేదికలు కూడా ఖరారు అయ్యాయి.

ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌

ఎస్‌జీఎఫ్‌ వేదికగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో, ప్రభుత్వ రంగ ఉద్యోగాల నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు పొందవచ్చు. తద్వారా జీవితంలో ఆర్థికంగానూ ప్రయోజనం పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement