మన్నవ ఓట్ల తొలగింపుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

మన్నవ ఓట్ల తొలగింపుపై విచారణ

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

మన్నవ ఓట్ల తొలగింపుపై విచారణ

పొన్నూరు: మండలంలోని మన్నవ గ్రామంలో ఓట్ల తొలగింపుపై గ్రామ మాజీ సర్పంచితోపాటు పలువురు జిల్లా కలెక్టరుకు చేసిన ఫిర్యాదులపై ఈఆర్‌ఓ ఐ. పద్మావతి శనివారం రాత్రి విచారణ చేపట్టారు. సర్‌ ప్రక్రియలో మార్గదర్శకాల ప్రకారం 2002లో ఓటు ఉన్నప్పటికీ కొందరు టీడీపీ నాయకులు దురుద్దేశంతో అసత్య ఫిర్యాదులతో ఓట్లు తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఫారం –7తో వందల ఓట్లను అక్రమంగా తొలగించారని గ్రామ మాజీ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావు, పలువురు గ్రామస్తులు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపుకు పొన్నూరు తహసీల్దార్‌ సహకరించారని ఆరోపించారు. అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చలేదని, పోలింగ్‌ కేంద్రాల మార్పు వంటి ఆరోపణలతో కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చిన నేపఽథ్యంలో విచారణకు ఆదేశించారు. ఈ విషయమై సాక్షి పత్రికలో ప్రచురితమైన అనేక కథనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 398 ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి తర్వాత, రాజకీయ కక్షతో ప్రస్తుతం 378 మంది ఓటర్లను అక్రమంగా తొలగించారని నాగమల్లేశ్వరరావు ఆరోపించారు. మరిన్ని ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈఆర్‌ఓ పద్మావతి గ్రామంలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ఆరా తీశారు. పేర్లు తొలగించిన ఓటర్లు స్థానికంగా ఉంటున్నారా అని వివరాలు సేకరించారు. ఏ ఆధారంతో ఓట్లు తొలగించారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. తహసీల్దార్‌ మహమ్మద్‌ జియావుల్‌హక్‌, డీటీ కరిముల్లా, ఆర్‌ఐ, బీఎల్‌ఓ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement