నేడు వైస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

నేడు వైస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం కళాకారులకు ఆహ్వానం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలలో సాంస్కృతిక కళా ప్రదర్శనలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. దరఖాస్తులను సోమవారం నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు స్వీకరిస్తారన్నారు. ఒక్కో బృందానికి గరిష్ఠంగా ఆరుగురు కళాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని, దేవస్థాన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక, భక్తి సంగీత, నృత్య కళాప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి దర్శనానికి ఆరుగురు కళాకారులను మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు లలిత కళలలో డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో పాటు కళారంగంలో అనుభవం, గత ప్రదర్శన పేపర్‌ క్లిప్పింగ్స్‌, ఫొటోలను జత చేయాలని సూచించారు.

మాచర్ల: పల్నాడు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమ వారం పిడుగురాళ్ల మెయిన్‌ రోడ్డులోని భవానీ ఫంక్షన్‌ హాలులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పల్నాడు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement