ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చండ్రాకోల్ చేతబట్టి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టచ్ పళ్ల పోటీలను ఆరంభించారు. ఆయా జిల్లాల నుండి వచ్చిన ఒంగోలు జాతి గిత్తలు పోటీల్లో పాల్గొన్నాయి.
ప్రారంభించిన ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల


