చేబ్రోలుః చేబ్రోలు సమీపంలోని బ్రిటీషు కాలం నాటి పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో అక్కడ ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. తెనాలి రూరల్ మండలం మల్లెపాడు ప్రాంతానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి కొమ్మమూరు బ్రిడ్జికి చేబ్రోలు వైపు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి నుంచి పొన్నూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తాడిబోయిన గోపి కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన తవ్వకాలు చేయటంతో గుంతలుగా ఉన్న ప్రాంతంలో పడిపోయాడు. ముఖానికి, కాళ్లు, చేతులకు గాయాలైన బాదితుడిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


