నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దంపతులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పోలీసు కార్యాలయంలో విఘ్నేశ్వరుని ప్రతిమను సోమవారం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అదనపు ఎస్పీ దంపతులు పోలీసు అధికారులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులు కలగాలని అదనపు ఎస్పీ ప్రార్థించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ ఎస్.ఆంథోని రాజు, ఆర్‌ఐలు కృష్ణా, గోపినాథ్, రాజు, యువరాజు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వేషన్లను పక్కాగా అమలు అమలు చేసి అర్హులైన, నిజమైన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని ఆయా వర్గాల వారు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు జిల్లాలోని 40 గ్రామాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ అర్చకులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతి 1950లో ఇచ్చిన ఆర్డర్ క్లాజ్ (3) ప్రకారం కేవలం హిందూ మతాన్ని అవలంబించే వారే ఎస్సీ వర్గానికి చెందుతారని, తదనంతర సవరణల ప్రకారం బౌద్ధులు, సిక్కులు కూడా ఈ పరిధిలోకి వస్తారన్నారు. చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. జిల్లా పరియోజన ప్రముఖ్ గోగినేని వెంకటరమణ, ఎస్సీ, ఎస్టీ దేవాలయ అర్చక స్వాములు పాల్గొన్నారు.
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయం కోసం ప్రత్యేకంగా రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇప్పటివరకు కలెక్టర్ కార్యాలయం, ఎస్‌పీ కార్యాలయాలకు ఒకే డీటీఆర్ ద్వారా విద్యుత్ సరఫరా నిర్వహించేవారు, ఇప్పుడు కేవలం కలెక్టర్ కార్యాలయం కోసం ప్రత్యేకంగా డీటీఆర్ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజయ్‌కుమార్, ఈఈ రాంబొట్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి... సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.హైమారావును సంప్రదించాలని పోలీసులు తెలి పారు.
నరసరావుపేట: పల్నాడులో ఏపీ అగ్నిమాపక సేవా రాష్ట్ర శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ శాఖ అదనపు సంచాలకులు ఆర్.జ్ఞానసుందరం కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మంగళవారం ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జిలానీతో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
రాజుపాలెం: అధిక వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి మలుపు వద్ద పాడుబడిన ఇంటిని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని అద్దంకి నార్కెటుపల్లి రహదారిపై పెద్ద నెమలిపురిలోని మలుపు వద్ద పోలేరమ్మ గుడి వద్ద మంగళవారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు చీరాల బీచ్‌కి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో నరసరావుపేట వైద్యశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఎస్‌ఐ మణికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. కారులో ప్రయాణిస్తూ గాయాలైన సుమిత్, గౌతమ్, యుగంధర్‌లు నరసరావుపేటలో వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లు ఎస్‌ఐ తెలిపారు.


