తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంట | - | Sakshi
Sakshi News home page

తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంట

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంట

తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను బాగా కలవరానికి గురి చేస్తున్నాయి. ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నా. పంట వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వర్షం కురవకపోవటంతో పంట బాగా దెబ్బతింది. పత్తి చెట్టుకు కాసిన పూత, పిందె, ఆకులు రాలిపోతున్నాయి. ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే పరిస్థితులు లేవు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కడితే పంటల బీమా వర్తింపజేశారు. ఇప్పుడు పంటల బీమా చేయాలంటే రూ.2 వేలు కట్టాలని చెబుతున్నారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు టీడీపీ ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

– బొమ్మిరెడ్డి నరసింహారావు, రైతు, దాచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement