ప్రతి ఏడాది ఈ సమయానికి మిర్చి పంట సాగు చేస్తాం. కానీ ఈసారి ఇప్పటి వరకు మొక్కలు వేయలేదు. నర్సరీల్లో పెంచుతున్నారు. వర్షం కురవకపోతే పంట సాగు చేసే పరిస్థితి ఉండదు. పత్తి పంట ఇప్పటికే చాలా వరకు నష్టపోయారు. మిర్చి పరిస్థితి కూడా దారుణంగా ఉండటంతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. మేజర్ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తే కాస్త వరకై నా రైతులు కోలుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కరువుతో అల్లాడిపోతున్నారు.
– కందుల జాను,
రైతు, సారంగపల్లి అగ్రహారం


