నాదెండ్ల: అసలే వృద్ధాప్యం.. ఆపై పక్షవాతం.. ఈ కారణంగా మతిస్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామంలో నివాసం ఉండే పోతురాజు కృష్ణారావు (70) ముఠా పనులకు వెళ్తుండేవాడు. గడిచిన నాలుగేళ్ళుగా పక్షవాతంతో బాధపడుతూ చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధాప్యం పైబడటంతో కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఉదయం గణపవరం నుంచి నాదెండ్ల వెళ్ళే డొంక రోడ్డులో ఐసీఎం కంపెనీ సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్‌ఐ వెంకయ్య సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.


