ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం

Feb 9 2026 7:45 AM | Updated on Feb 9 2026 7:45 AM

ఫొటోగ

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం నేడు పోలీస్‌ గ్రీవెన్స్‌ తాత్కాలిక రద్దు బాల కోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం లారీలో షార్ట్‌ సర్క్యూట్‌ వీరమ్మ తల్లి తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు

తెనాలి: తెనాలి కెమెరా క్లబ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ ఫంక్షన్‌హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్‌లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్‌ఏఎఫ్‌యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్‌ ప్రిన్సిపాల్‌ ఆనంద్‌, హెచ్‌ఓడీ కమల్‌రాయ్‌ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్‌ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు.

నగరంపాలెం: జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్‌ బందోబస్త్‌ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు.

గోవాడ(వేమూరు): మహాశివరాత్రిని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘంటా నిర్మలమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు దేవస్థానం చైర్మన్‌ రమేష్‌ తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం తెనాలి కుమార్‌ పంప్స్‌ అధినేత సబ్రహ్మణ్యం రూ.70 వేల విలువైన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం దాతలు ఆలయంలో పూజలు నిర్వహించారు.

నిమిషాల్లో దగ్ధమైన క్యాబిన్‌

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్‌ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌, క్లీనర్‌ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్‌ లోడ్‌ వల్ల లారీ ఇంజిన్‌ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు.

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం 1
1/3

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం 2
2/3

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం 3
3/3

ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement