కొత్త ఆశలతో
సత్తెనపల్లి: పాత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త ఆశలతో నవ వసంతంలోకి ప్రజలు అడుగుపెట్టారు. అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుకు సాగారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొంగొత్త అనుభూతి. స్మార్ట్‌ఫోన్, సోషల్‌మీడియా రంగప్రవేశంతో అందరూ పోటీ పడి మరీ న్యూ ఇయర్ అభినందనలతో పోస్టింగులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌లో సందేశాలు పంపడంలో అధిక శాతం మంది నిమగ్నమయ్యారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మార్కెట్‌లో బేకరీలు, పూలు, పండ్లు, రంగుల దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. మహిళలు, యువతులు తమ ఇళ్ల వద్ద అందంగా రంగవల్లులు వేశారు. ఘుమఘుమలాడే బిర్యానీ పాయింట్లు పెద్దసంఖ్యలో వెలిశాయి. మార్కెట్‌లో వివిధ రకాల పూల బొకేలను విక్రయిస్తున్నారు. బేకరీలో అనేక ఆకారాలు, రంగులు, సైజుల్లో కేక్‌లను విక్రయించారు. తమ అభిమాన రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు బొకేలతో పాటు పూలు, పండ్లు కొనుగోలు చేస్తూ బిజీ అయ్యారు. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి ప్రజలు సందడి చేశారు. పలు ఆలయాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. ప్రధానమైన చర్చిలన్నీ విద్యుత్ కాంతలతో మిరిమిట్లు గొలుపుతున్నాయి. ఆలయాల్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సంబరాలపై పోలీసులు ఇప్పటికే నిషేధ ఆజ్ఞలు విధించారు. ఎవరైనా అడ్డగోలుగా హంగామా చేస్తే కేసులు తప్పదంటూ హెచ్చరికలు చేస్తూ బుధవారం అర్ధరాత్రి బందోబస్తు నిర్వహించారు.
రంగులు కొనుగోలు చేస్తున్న మహిళలు
గాంధీబొమ్మ సెంటర్‌లో కేక్‌ల విక్రయాలు
ఆచార్యా.. అంతా అధ్వానమే
జిల్లాలో నూతన సంవత్సర సందడి
పూలు, పండ్ల మార్కెట్లలో రద్దీ
బేకరీల్లో పెరిగిన కేకుల విక్రయాలు
పెద్దసంఖ్యలో వెలిసిన బిర్యానీ పాయింట్లు
రంగవల్లులతో వాకిళ్లు కళకళ
కొత్త ఆశలతో
కొత్త ఆశలతో
కొత్త ఆశలతో


