అక్రమ కేసులపై నిరసన ర్యాలీ
వెల్దుర్తి: పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ భారీ ఎత్తున జరిగింది. పిన్నెల్లి సోదరుల స్వగ్రామమైన కండ్లకుంట గ్రామంలో స్థానికులంతా ఏకమై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. గుండ్లపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరు, జంట హత్యలు చేసుకుంటే పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా ఇరికించటం మంచి పద్ధతి కాదన్నారు. పీఆర్కే, పీవీఆర్‌లపై పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకముందని, వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మోదుగుల వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, ఈడెబోయిన వెంకయ్య, అమరయ్య, యూత్ లీడర్ పిన్నెల్లి హనిమిరెడ్డి, సూదనబోయిన అయ్యన్న, జంగిల్ శ్రీను, బొనిగె పేతురు, శేషు, ముక్కా రామయ్య, సాయిలు, తాళ్ళ శ్రీను ముదిరాజ్, గుమ్మా పులయ్య, జిడ్డు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


