న్యూస్‌రీల్
2,561 హెక్టార్లలో నీట మునిగిన పంటలు
వెలుగు కార్యాలయంలో ఆడిట్
గ్రామదేవతలకు చద్ది సమర్పణ
జిల్లా వ్యాప్తంగా 120 సెంటీమీటర్ల వర్షం
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పగటి పూట వర్షం పడకపోవడంతో రైతులు, ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. మంగళ, బుధవారాల్లో కురిసన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ప్రవహించిన వాగులు, వంకలు కొంతమేర శాంతించాయి. అయినప్పటికీ గురువారం కూడా చప్టాలపై వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. పంట పొలాలలో నీరు తగ్గడంతో మొక్కలు మేట పడిన దృశ్యాలు కనిపించాయి. రాజుపాలెం మండలం బలిజేపల్లి దగ్గర చప్టాపై వర్షపునీరు ప్రవహించడంతో బలిజేపల్లి–ఉప్పలపాడు మధ్య రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై ఐదు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించింది. దీంతో ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. గురజాల మండలం మాడుగుల వద్ద ఎద్దుల వాగు, చర్లగుడిపాడు జంగమేశ్వరపురం మధ్య నల్లవాగు, రెంటచింతల మండలంలో గోలివాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం వద్ద పిల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో శ్రీరుక్మిణిపురం, పిల్లుట్ల, బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు మండలం పాటిబండ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించండంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 120 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వ్యాప్తంగా సగటున 4.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకరికల్లు మండలంలో 9 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా రెంటచింతలలో 0.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి, కారంపూడి, రాజుపాలెం మండలాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఆగస్టు మాసం 14వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 6.31 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17 సెంటీమీటర్ల వర్షపాతం పడింది.
క్రోసూరులో నీట మునిగిన పత్తి మొక్కలు
ఉధృతంగా ప్రవహిస్తున్న పిల్లేరు వాగు
గురువారం తెల్లవారుజామున వరకు కొనసాగిన భారీ వర్షాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న
వాగులు, వంకలు
రాజుపాలెం మండలంలో బలిజేపల్లి
వద్ద ప్రమాదక స్థాయిలో వర్షపు నీరు
వర్షాలకు దెబ్బతిన్న ముదురు
పత్తి, కంది, వరి పంటలు
2,561 హెక్టార్లలో పంట నీట మునిగిందంటున్న వ్యవసాయశాఖ
బొల్లాపల్లి : స్థానిక వెలుగు పథకం కార్యాలయంలో గురువారం ఆడిట్ నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిధులకు సంబంధించి ఆడిట్ జరిగింది.
వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు గురువారం చద్ది సమర్పించారు. భక్తులు పూజలు జరిపారు.
భారీ వర్షాలవల్ల పంట పొలాలలో వర్షపునీరు భారీగా చేరి పంటలు నీట మునిగాయి. అమరావతి, క్రోసురు, పెదకూరపాడు, రెంటచింతల మండలాల పరిధిలో పత్తి, కంది, వరి పంటలు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గురువారం ప్రకటించారు. మొత్తం 2,561 హెక్టార్లలో పంట నీటమునగగా అందులో 2,530 హెక్టార్లలో పత్తి, 20 హెక్టార్లలో వరి, 11 హెక్టార్లలో కంది పంట నీటమునిగింది. వర్షాలు కొనసాగి, వర్షపునీటిలో మొక్కలు మునిగితే నష్టం అపారంగా ఉండనుంది. జిల్లాలో ఉద్యానపంటల సాగు పూర్తిస్థాయిలో మొదలుకాకపోవడం వల్ల పంటలకు పెద్దగా నష్టం లేదని అధికారులు తెలిపారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు