
● మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా!
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసుకుని ప్రతి ఏటా వారిని స్మరించుకుంటాం. ఆ మహనీయులకు తీరని అవమానం జరిగింది. పిడుగురాళ్లలోని రైల్వేస్టేషన్‌రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జమునా స్కూల్) ఆవరణలో జాతిపిత మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు, లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాలను ఏర్పాటుచేశారు. మూడేళ్ల కిందట పాఠశాల పునఃనిర్మాణం చేపట్టారు. విగ్రహాలను తీసి పక్కన పెట్టారు. విగ్రహాలను పునఃప్రతిష్ట చేయలేదు. – పిడుగురాళ్ల