
నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు
సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం
మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితుడు రంజిత్ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్‌ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్ అంగీకరించాడు. జగదీష్ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగనే ఇద్దరు వ్యక్తులు జగదీష్ కారును అడ్డగించారు. పోలీస్ దుస్తులలో ఉన్న వారు విజిలెన్‌న్స్ అధికారులం అంటూ, జగదీష్ కారులో ఉన్నఐ రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్ తన స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మేడికొండూరు సీఐ నాగూర్ మీరాసాహెబ్, ఎస్‌ఐ సుబ్బారావు, కానిస్టేబుల్ జాన్ సైదా, బాజీ సాహెబ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.