
తటాకం కాదు మైదానం!
ఈ చిత్రం చూసి, ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది.. అనుకుంటే బురదలో కాలేసినట్లే.. వారు అలా ఈత కొడుతుంది ఎటూపోయే మార్గంలేక నిలిచిపోయిన వర్షం నీటిలో.. బెల్లంకొండ జెడ్పీ హైస్కూల్ మైదానంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురవడంతో వర్షపు నీరు పాఠశాల మైదానంలో నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో చిన్నారులు గురువారం ఇలా ఈత కొడుతూ కనిపించారు. వర్షం పడిన ప్రతిసారి పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోజుల తరబడి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. – బెల్లంకొండ