
పరవళ్లు తొక్కుతున్న శింగరేశ్వర జలపాతం
బెల్లంకొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలోని శింగరేశ్వర జలపాతం పరవళ్లు తొక్కుతుంది. శ్రీ కొండ శింగరేశ్వర స్వామి వద్ద గల కొండల మీద నుంచి భారీగా వస్తున్న నీటితో ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. దాదాపు100 అడుగుల ఎత్తు కొండల మీద నుంచి పాల నురగల్లా జాలు వారుతున్న నీటిధారలతో జలపాతం అబ్బురపరుస్తుంది. బుధవారం వర్షం పడుతున్నప్పటీకీ పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతంలో తడుస్తూ సందడి చేశారు.