గత ఆరేళ్ల నుంచి నరసరావుపేట పుర పాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. అప్కాస్‌లో మా పేర్లు నమోదయ్యాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లిస్తున్నాం. మేం 30రోజులు పనిచేస్తున్నా మాకు రూ.6–7వేలే చెల్లిస్తున్నారు. మాకు రూ.21వేలు జీతం రావాల్సివుంది. అదేమని మున్సిపల్ కమిషనర్‌ను అడిగితే మీకు వచ్చేది అంతే, మీరు బదిలీ కార్మికులు, ఇష్టమైతే చేయండి, లేకపోతే మానుకోండి అంటూ 40మందిని ఆపేశారు. మళ్లీ విధుల్లోకి తీసుకొని పూర్తిజీతం చెల్లించాలి.
–షేక్ శిలార్, మున్సిపల్ కార్మికులు, నరసరావుపేట