ఏఎన్‌యూ(గుంటూరు): ఏపీ ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న లెనిన్ ఓల్గా మెమోరియల్ అండర్–13, అండర్–10 ఆర్చరీ చాంపియన్‌షిప్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభకు ఏఎన్‌యూ వీసీ కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో విలువిద్యకు వర్సిటీ పూర్తి సహకారం అదిస్తుందన్నారు. ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధ్దికి యూనివర్సిటీలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ ఆర్చరీ క్రీడను రానున్న రోజుల్లో ఏఎన్‌యూలో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, నేషనల్ జడ్జి బి.వి.రమణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి అండర్–13 విభాగంలో 700 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. తొలిరోజు రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాలలో ర్యాంకింగ్ పోటీలు జరిగాయి.