పర్లాకిమిడి:
అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గజపతి జిల్లా రైతాంగం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో భయందోళనల మధ్య వరి కోతలు ప్రారంభించారు. నెలరోజుల్లో వరుసగా రెండు తుపానులు అర్నబ్, మురసు తుపానుల వల్ల గుసాని, రాయఘడ, నువాగడ రామగిరి ప్రాంతంలో ఖరీఫ్ పంట నేలకొరిగింది. అనేక ఉద్యానవనాలు బప్పాయి, మొక్కజొన్న, అరటి, కాయగూరల పంటలు ధ్వంసమయ్యాయి. గజపతి కలెక్టరేట్‌లో అక్వాన్ తుపాను సమాచారం కోసం 24 గంటల ఎమర్జెన్సీ సెల్‌ను జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు ఎమర్జెన్సీ అధికారి బిజయకుమార్ రవులో తెలియజేశారు. పర్లాకిమిడి ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్లు 06815–222943, గుసాని సమితి 8895949702, గుమ్మ బ్లాక్ 91249 60747, కాశీనగర్ ఎన్‌ఏసీ 06815 284215, రాయఘడ 90784 92251, మోహానా 63708 11950, నువాగడ 76089 73453, పర్లాకిమిడి పురపాలక సంఘం 06815 222052 నంబర్లను ఏర్పాటు చేశారు.


