ఎల్.ఎన్.పేట: ఎల్.ఎన్.పేట జంక్షన్‌లో రూ.500 నకిలీ నోటు మంగళవారం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి మెడికల్ షాపు వద్దకు ఓ వ్యక్తి వచ్చి 500 రూపాయల నోటుకు చిల్లర మార్చి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం ఆ నోటను పరిశీలించి నకిలీ నోటుగా గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని యజమాని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. గట్టిగా నిలదీయగా ఒరిజినల్ రూ.500 నోటు ఇచ్చి నకిలీ నోటును తీసుకువెళ్లినట్లు తెలిసింది. నకిలీ నోటు మండల కేంద్రంలో ప్రత్యక్షం కావడంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల ఓటర్లకు ఇలాంటి నోట్లు అందించి ఉంటారని గుసగుసలాడుకుంటున్నారు.


