లయన్స్‌ క్లబ్‌కు రెండు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌ క్లబ్‌కు రెండు అవార్డులు

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

రాయగడ: లయన్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా స్థాయి కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ రాయగడ అపరాజిత సభ్యులు విశేష ప్రతిభ కనబరిచి పలు అవార్డులు సాధించారు. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్‌ తరపున ముగ్గురు ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో జోనల్‌ చైర్‌పర్సన్‌ లయన్‌ జి.రామకృష్ణ, క్లబ్‌ అధ్యక్షురాలు పెంట కల్యాణి, ఉపాధ్యాక్షురాలు కె.శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శిక్షణ పోటీల్లో భాగంగా లయనిజం మూల్యాంకన విభాగంలో కె.శరణ్య ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే లయనిజం అభివృద్ధి, సభ్యులను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, సభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో క్లబ్‌ చేపట్టిన విశిష్ట కార్యక్రమాలకు గుర్తింపుగా క్లబ్‌ ఆఫ్‌ రాయగడ అపరాజిత సభ్యులకు ప్రథమ బహుమతి లభించింది. ఈ విజయాలు క్లబ్‌ సభ్యుల అంకితభావం, ఐకమత్యం, సేవాస్ఫూర్తికి నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. లయన్స్‌ సంస్థ నినాదమైన మేము సేవ చేస్తాం అనే లక్ష్యంతో భవిష్యత్‌లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement