టీచర్‌ దెబ్బలకు విద్యార్థి మృతి చెందినట్లు ఆరోపణ | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ దెబ్బలకు విద్యార్థి మృతి చెందినట్లు ఆరోపణ

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

కొరాపుట్‌: ఉపాధ్యాయుడి దెబ్బలకు విద్యార్థి మృతిచెందినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. కొరాపుట్‌ జిల్లా జయపూర్‌ సమితి గొడ పొదర్‌ ప్రభుత్వ హాస్టల్‌లో 5వ తరగతి విద్యార్థి గంగా జానీ (10) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10 రోజుల క్రితం స్కూల్‌ లో ప్రధానోపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో రొండాపల్లి గ్రామ పంచాయతీ కెందుగుడ గ్రామంలో ఇంటికి వచ్చాడు. బాలుడు అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూమృతి చెందాడు. బాలుడి మృతికి ఉపాధ్యాయుడే కారణం అంటూ బాధిత గ్రామ ప్రజలు జయపూర్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీజేడీకి చెందిన యువ నాయకురాలు శిల్పా ఫాణీ ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement