కొరాపుట్: వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క పర్యటించారు. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి రొట్టాలి, టొకిగుడ, నాయక్‌గుడ గ్రామాల్లో బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వరద నీరు వలన పాడైన పుస్తకాలు పరిశీలించారు. అనంతరం కోట్‌పాడ్ సమితి గౌలి, చందిలి, సదరంగ, గుమడ గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, వరద నీరు పారడం వలన కొట్టుకుపోయిన పంటలు, తదితర నష్టాలు ప్రజలు వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పర్యటనలో డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్, రైల్వే సభ్యుడు మనోజ్ ఆచార్య, కోట్‌పాడ్ మున్సిపల్ చైర్మన్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


