రాయగడ: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాసీ్త్రల జయంతి వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ, పౌర సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో గాంధీజీ సత్యం, అహింస, పరిశుభ్త, సర్వమత సమభావం, శాసీ్త్రజీ సరళత, కర్తవ్యనిష్ట, దేశసేవ వంటి ఆదర్శాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గజపతి కూడలి నుంచి మహాత్మగాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఎస్‌డీసీ ఉపాధ్యక్షురాలు మంజుల మినియాక, సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, జిల్లా అదనపు కలెక్టర్‌లు రవీంద్ర కహార్, నిహారి రంజన్ కుహరో తదితరులు ర్యాలీలొ పాల్గొన్నారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద గల గాంఽధీ, శాసీ్త్ర విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సర్వమత గ్రంథపారాయణ నిర్వహించారు.
రక్తదాన శిబిరం
స్థానిక పీఎంశ్రీ జీసీడీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గాంధీ జయంతి, లాల్ బహదూర్‌శాసీ్త్ర, సేవ సంకల్ప్ అభియాన్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా అత్యవసర అధికారి కలింగ పూజారి శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.


