జూడో పోటీలకు క్రీడాకారులు పయనం | - | Sakshi
Sakshi News home page

జూడో పోటీలకు క్రీడాకారులు పయనం

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

మల్కన్‌గిరి: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పాల్గోనున్న 23 మంది క్రీడాకారులు, నలుగురు అధికారులు గురువారం మల్కన్‌గిరి నుంచి సంబల్‌పూర్‌కు పయనమయ్యారు. ఈ జూడో పోటీలు అక్టోబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయి. క్రీడాకారులకు జిల్లా డీఐపీఆర్‌ ప్రమిళ మాఝి, లేబర్‌ అధికారి పూర్ణిమా దురుక తదితరులు అభినందనలు తెలిపారు.

7న గుణుపూర్‌లో

బీజేడీ పాదయాత్ర

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఈ నెల ఏడవ తేదీన బీజేపీ పార్టీ భారీ పాదయాత్రను నిర్వహించనుంది. ఇందులో భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పద్మపూర్‌ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించే అంశంపై సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. పద్మపూర్‌లోని గాయత్రీ మందిరం ప్రాంగణంలో జరిగిన సమావేశంలొ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో బీజేడీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సుధీర్‌ కుమార్‌ దాస్‌, గుణుపూర్‌ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగో, జిల్లా కార్యదర్శి గగన్‌ బిహారి ఆచార్య, రాష్ట్ర బీజేడీ విద్యార్థి విభాగం కార్యనిర్వహాక అధ్యక్షుడు విష్ణు ప్రసాద్‌పండ, పద్మపూర్‌ ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు, పార్టీ క్యాకర్తలు పాల్గొన్నారు.

కొత్తవలస–కొరాపుట్‌ డబ్లింగ్‌లో కీలక ముందడుగు

● 829 మీటర్ల సొరంగం ఛేదింపు పూర్తి

భువనేశ్వర్‌: కొత్తవలస–కొరాపుట్‌ రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. తూర్పు కోస్తా రైల్వే రాయగడ మండలం పరిధిలోని బొర్రా గుహలు–కరకవలస స్టేషన్ల మధ్య నిర్మి స్తున్న 41 – 41ఏ నంబరు సొరంగాన్ని అక్టోబర్‌ 1న విజయవంతంగా ఛేదించారు. సొరంగం రెండు వైపుల నుంచి చేపట్టిన తవ్వకాలు నిర్దేశిత అమరికకు 100 శాతం కచ్చితత్వంతో కలవడం ఈ పనుల్లో కీలక ఘట్టంగా నిలిచింది. మొత్తం 829 మీటర్ల పొడవున్న ఈ సొరంగాన్ని గురప్రు నాడా (హార్స్‌ షూ) ఆకృతిలో నిర్మించారు. గరిష్టంగా 8 డిగ్రీల వంపు కలిగిన మార్గంలో ఈ నిర్మాణం చేపట్టారు. బొర్రా గుహలు – కరకవలస బ్లాక్‌ సెక్షన్‌లో సొరంగం ఛేదింపు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.

ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనం

సవాళ్లతో కూడిన సొరంగ భాగంలో భారీ రైల్వే మౌలిక సదుపాయాల నిర్మాణం విజయవంతం కావడం సాంకేతిక నైపుణ్యం, ఇంజినీరింగ్‌ కచ్చి తత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని అధికార వర్గాలు అభినందించాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తవలస – కొరాపుట్‌ మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతోపాటు నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రాకపోకలు మరింత సజావుగా సాగేందుకు వీలు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement