క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

జయపురం: స్థానిక విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో జయపురం క్రీడా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ‘ఖేలేగా భారత్‌ – జీతేగా భారత్‌’ థీమ్‌తో మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు. వర్సిటీ క్రీడా మైదానంలో వీసీ ప్రొఫెసర్‌ హృషికేష్‌ శనాపతి క్రీడా శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ మహేష్‌ చంద్ర నాయిక్‌, సీపీజీసీ డాక్టర్‌ ప్రశాంత కుమార్‌ పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement