భువనేశ్వర్: నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పూరీలో ఉంటున్న అంతర్జాతీయ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు హృద్యమైన సైకత యానిమేషన్‌ను రూపొందించారు. కరుణ, ఐక్యత, మానవత్వంతో వరద ప్రభావిత పొరుగు దేశంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అండగా నిలవాలని, కేవలం 15 నిమిషాల్లో రూపు దిద్దుకున్న సృజనాత్మక కళా ప్రదర్శనతో కళాత్మకంగా పిలుపునిచ్చారు. మానవత్వంతో మనమందరం కలిసి చేయూతగా నిలబడి నేపాల్ బాధితుల కోసం ప్రార్థిద్దామని కళాకృతితో కోరారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు ప్రార్థనలు, మానవతా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


