జయపురం: జయపురం పట్టణ పోలీసులు నాలుగు కేసుల్లో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 మోటారు బైక్‌లు, కత్తి, డబ్బు, బాసుమతి బియ్యం బస్తాలు స్వాధీన పరచుకున్నట్లు పట్టణ పోలీసులు ఉల్లాస చంధ్ర రౌత్ వెల్లడించారు. బైక్ ల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు సుండిగుడ గ్రామానికి చెందిన దిలీప్ ఖొర(26), హటపొదర్ గ్రామం రాజు మఝి(23), నువాగుడ గ్రామం జగదీష్ హరిజన్(28). వీరి వద్ద నుంచి 8 బైక్‌లు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా బాసుమతి బియ్యం దొంగతనం కేసులో డెప్పిగుడ వాసి అభి రావు(21), గాంధీ చక్ కెనాల్ రోడ్డు రాజేష్ పాయిక్(25)లను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి వద్ద బాసుమతి బియ్యం ప్యాకెట్లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. అలాగే మారణాయుధాలు చూపి ప్రజలను భయబ్రాంతులను చేస్తూ దోచుకునే ఆరోపణలపై నమోదైన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు హటపొదర్ రాఖేల్ ఖొర(19), డెప్పుగుడ వాసి ఉత్తమ నాగ్ (21), ప్రసాదరావు పేట వాసి రింకు బాగ్(20) అని వెల్లడించారు. వారి నుంచి రూ.500 నగదు, కత్తి స్వాధీన పరచుకున్నుట్లు వెల్లడించారు. అవి కాకుండా పట్టణ పోలీసు స్టేషన్ కేసులో జయపురం పొరజా వీది నివాసి భగవాన్ మాలీ(21) ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంధ్ర రౌత్ వెల్లడించారు.


