రక్తదాతల కోసం వెబ్‌సైట్‌ | - | Sakshi
Sakshi News home page

రక్తదాతల కోసం వెబ్‌సైట్‌

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

రక్తదాతల కోసం వెబ్‌సైట్‌

రాయగడ: అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించేందుకు తాసుబెల్లి ఫౌండేషన్‌ మరో కీలక ముందడుగు వేసింది. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంతో పాటు.. అవసరమైన రోగులను రక్తదాతలతో అనుసంధానం చేసేందుకు అధికారిక www. thasubellifoundation.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తలసేమియా బాధపడుతున్న చిన్నారులు, క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరమయ్యే రోగులకు సకాలంలో రక్తం అందించడం ఎంతో అవసరమని భావిస్తూ అందరి సహకారంతో వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నట్లు జేకేపూర్‌లోని తాసుబెల్లి ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి సకాలంలో రక్తం అందించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేకే పేపర్‌ మిల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో పనిచేస్తున్న సిద్దా క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి రక్తదాతగా నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement