నేపాల్‌ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

నేపాల్‌ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

నేపాల్‌ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు

భువనేశ్వర్‌: నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో రాష్ట్రానికి చెందిన మరో 3 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. బర్గఢ్‌ జిల్లా జంపాలి గ్రామానికి చెందిన దంపతులు, వారి రెండేళ్ల కుమార్తె ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన దంపతులు గున్నం జయకృష్ణ, గున్నం సాయి విందు కుమారి. వారి రెండేళ్ల కుమార్తె ఉన్నారు. జయకృష్ణ నేపాల్‌లోని ఒక జలవిద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, వర్షాల కారణంగా కుటుంబంతో సంబంధాలు తెగిపోవడంతో బర్‌గడ్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త బర్‌గడ్‌లో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. అదృశ్యమైన ముగ్గురూ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. గల్లంతైన కుటుంబం కోసం ఒక సహాయక బృందం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత నేపాల్‌ వరదల్లో గల్లంతైన ఒడియా ప్రజల సంఖ్య 5కి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement