ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు | - | Sakshi
Sakshi News home page

ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

టెక్కలి రూరల్‌: శ్రీకాకుళం జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని ఆ క్రీడ కార్యదర్శి కె.చిరంజీవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్‌ జూనియర్‌ బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ జట్లకు జరిగే ఈ ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ ఎంపికలు ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయని, ఎంపికై న జట్టు వచ్చే నెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే 11వ రారష్ట్‌రస్థాయి సబ్‌ జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌ షిప్‌ 2026లో పాల్గొంటారని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

యువకుడు అదృశ్యం

మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు ‘సి’ గ్రామానికి చెందిన బదకల హరి (17) గురు వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్‌ రీచార్జ్‌ చేస్తానని తన తల్లి బదకల ఆదిలక్ష్మిని డబ్బులు అడిగి ఇంటి నుంచి వెళ్లాడు. శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశా రు. వారి బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. యువకుడు మెళియాపుట్టి జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం మధ్య లోనే నిలిపి వేసి, మేకలు కాపలా కాసుకుంటున్నాడు. ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదనీ, మొబైల్‌ రీచార్జ్‌ అని డబ్బులు తీసుకుని వెళ్లాడనీ, మొబైల్‌కు ఫోన్‌ చేసినా అవ్వడం లేదని తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘పీఎఫ్‌ ఫైనల్‌ క్లెయిమ్స్‌ పరిష్కరించాలి’

శ్రీకాకుళం: రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, రెగ్యులర్‌ ఉద్యోగుల జిల్లా పరిషత్‌ పీఎఫ్‌ ఫైనల్‌ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడంలో జిల్లా ప్రజా పరిషత్‌, స్టేట్‌ ఆడిట్‌ కార్యాలయాల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటరామన్‌, జిల్లా ఆడిట్‌ అధికారి కె.అంబేడ్కర్‌ను కలిసి సమస్యలపై చర్చించి మెమొరాండం సమర్పించారు. క్లెయిమ్‌లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం సబబు కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement