గ్యాస్‌ కృత్రిమ కొరత..! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కృత్రిమ కొరత..!

Mar 16 2026 7:40 AM | Updated on Mar 16 2026 7:40 AM

పర్లాకిమిడి: పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతుండడంతో గజపతి జిల్లా పర్లాకిమిడిలో వ్యాపారులు, డీలర్లు కృత్రిమ గ్యాస్‌ కొరత సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పర్లాకిమిడి శివార్లలో ఉన్న మహేంద్రతనయ నది వద్ద ఎల్‌.పి.జీ. గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్లు పట్టుకుని క్యూ కడుతున్నారు. గృహా వినియోగదారుల గ్యాస్‌ 15 కిలోల ధర రూ.60 పెరిగి వెయ్యి రూపాయలు చేరడంతో వినియోగదారులు గ్యాస్‌ను బుక్‌ చేసుకుని భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీల గోడౌన్‌లకు పరిగెడుతున్నారు. గతంలో గ్యాస్‌ బుక్‌చేసిన ఇరవై నాలుగు గంటల్లో వినియోగదారుడు ఇంటికి చేర్చేవారు. కొందరు వంటగ్యాస్‌ను బ్లాక్‌లో రూ.2,000లకు అమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ 19 కిలోలు విడుదల ఆపివేయడంతో హోటళ్లు, రోడ్డు పక్కల బజ్జీ వ్యాపారులు బ్లాక్‌లో వంట గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నారు. సివిల్‌ సప్‌లై అధికారులు చూసి చూడనట్టుగా ఉండండంతో ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వినియోగాదారులు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోతే గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ నల్లబజారులో అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పర్లాకిమిడి భారత్‌ గ్యాస్‌ కంపెనీ డీలర్‌కి మొత్తం 30,432 వినియోగదారులు ఉండగా, 180 కమర్షియల్‌ గ్యాస్‌ సిలెండర్లు విడుదల చేస్తున్నారు. హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీ డీలరుకు 39,075 వినియోగదారులు ఉండగా.. 453 కమర్షియల్‌ వినియోగదారులు ఉన్నారు. గజపతి జిల్లాలో గ్యాస్‌ నిల్వలు స్థిరంగా ఉన్నాయని వివిధ కంపెనీల గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు. వినియోగదారులకు గ్యాస్‌ అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పలువురు దుకాణదారులు గృహ వినియోగదారుల గ్యాస్‌ సిలెండర్లనే వినియోగించడంతో ప్రజలకు గ్యాస్‌ లభించక, కృత్రిమ గ్యాస్‌ కొరత సృష్టిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ హోటళ్లు, వివిధ రెస్టారెంట్లు, వివిధ గోడౌన్‌లను చెక్‌ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement