● త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమేళా సమితిలో నిర్మాణంలో ఉన్న పోలేరు వంతెన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్‌అర్వింద్ రాజేశిర్కే ఆదివారం పరిశీలించారు. పనుల గురించి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ వంతెన కేవలం రవాణా సౌకర్యానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, సంస్కృతితో అనుబంధమై ఉందన్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ బడా యాత్ర సమయంలో ఈ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండటాన్ని గుర్తించారు. ప్రజల సౌకర్యం, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వంతెన నిర్మాణం పనులు రానున్న బడా యత్ర సమాయానికి పూర్తిచేయాలని అదేశించారు . పోలేరు వంతెన స్థానిక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపే కీలక వంతెనగా ఉందన్నారు. ఇది పూర్తయితే వేలాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. రవాణా సౌకర్యాల్లో కూడా పెద్ద మార్పు వస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం వివిధ ధార్మిక ప్రదేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా కలెక్టర్ దృష్టి సారిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలేరు ప్రాంతంలోని ప్రసిద్ధ మౌలిమాత ఆలయం, మన్యంకొండ గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతాభివృద్ధి కోసం అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట కలిమెల సమితి జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, సమితి వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు.


