పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఉగాది వేడుకలు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు జంగంవీధి జంక్షన్ సింహాద్రి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించేందుకు చైతన్య కార్యవర్గం ఆదివారం నిశ్చయించింది. శ్రీధర్‌నగర్‌లో చైతన్య కార్యదర్శి బి.జనార్దనరావు స్వగృహంలో చైతన్య కార్యవర్గ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పరాభవ నామ సంవంత్సరం ఉగాది పంచాంగ శ్రవణం స్థానిక వేంకటేశ్వర దేవాలయంలో కళ్యాణ మండపంలో ఉదయం పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. 22న జరుగు ఉగాది వేడుకల్లో మహిళల ప్రత్యేక ఫ్యాషన్ షో, ఉగాది పాటల వల్లరి, కూచిపూడి, భరత నాట్యం, అనేక మంది ఔత్సాహిక గాయనీ గాయకులు పాల్గొంటారని కార్యదర్శి బర్నాల జనాఽర్దనరావు తెలిపారు. అదేరోజు చైతన్యసమితి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని చైతన్య కన్వీనర్ డాక్టర్ రహమతుల్లా తెలియజేశారు.
నూతన కార్యవర్గం..
చైతన్య సమితి నూతన అధ్యక్షుడిగా కోండా రామారావు, ఉపాధ్యక్షులుగా ఎం.శేఖర్‌రావు, జవ్వాది సూర్యారావు, కార్యదర్శిగా బి.జనార్దనరావు, సహాయ కార్యదర్శిగా జి.నానాజీ, కోశాధికారిగా బి.వాసుదేవరావు, కన్వీనర్‌గా డాక్టర్ సయ్యద్ రహమతుల్లా, కో కన్వీనర్‌గా ఇసై వెంకట్రావు, గౌరవ అధ్యక్షుడిగా ఆనందరావును ఎన్నుకున్నట్టు తెలియజేశారు.


