బాల్య వివాహాలతో అనర్థాలు
రాయగడ: బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని వక్తలు అన్నారు. ఈ మేరకు అవగాహన కల్పిస్తూ జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డైలీ మార్కెట్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సుబ్రత్ ఆచార్య నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల రహిత భారత్ నిర్మిద్దాం
జయపురం: బాల్య వివాహాల రహిత భారత్‌ను నిర్మిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా న్యాయసేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా న్యాయసేవా ప్రదీకరణ అధ్యక్షుడు, కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి మార్గదర్శకంలో సివిల్ కోర్టు, జయపురం రిజిస్ట్రార్, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ ఇన్‌చార్జి కార్యదర్శి విష్ణు ప్రసాద్ దేవత జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో విక్రమదేవ్ వర్సిటీ జయపురం రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్, ఎన్‌సీసీ కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, వర్సిటీ అధ్యాపక బృందం సభ్యులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలతో అనర్థాలు


