జర్నలిస్టుల వనసమారాధన
జయపురం: దాదాపు రెండు దశాబ్దాల తరువాత జయపురం పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియ ప్రతినిధులు కలిసి సామూహికంగా వనభోజన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జయపురం సమితి గొడొపొదర్ పిక్నిక్ స్పాట్‌లో నిర్విహించబడిన కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. సమయో ఒడియ దినపత్రిక ప్రతినిధి రబి నాయిక్, ప్రముఖ ఒడియా దినపత్రిక సంబాద్ జయపురం విలేఖరి తరుణ కుమార్ మహాపాత్రోలు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో అవిభక్త కొరాపుట్‌లో సీనియర్ పాత్రికేయులు వి.భాస్కరరావు, ఒడిశా జర్నలిస్ట్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, పాత్రికేయులు నరసింగచౌదురి, పింటు పూజారి, మనోజ్ కుమార్ నాయిక్, పలువురు చిన్న, మీడియం పత్రికల సంపాదకులు, పలు దిన పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మనలో సమైఖ్యత, కొత్త వారికి పత్రికా రంగంపై అవగాహన కలుగుతాయని అభిప్రాయపడ్డారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో పాత్రోగూడ వీధి వద్ద ఉన్న సెంట్ జేవియర్ హైస్కూల్‌లో ఆదివారం పాఠశాల వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపాల్ నభోకిశోర్ సర్కార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా విద్యావేత్త రామకృపనాయక్, సినీయర్ జర్నలిస్టు రత్నాకర్ దాస్, కౌన్సిలర్ సంయుక్తా దాస్, పాఠశాల చైర్మన్ మోహన్ చంద్ర పాడీ హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువుతోపాటు ఇతర నైపుణ్యాలు కూడా అవసరమన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సంగీతం, ముగ్గుల పోటీలు, ఆహార మేళా నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బిజూ యువ జనతాదళ్ అధ్యక్షుల నియామకం
రాయగడ: రాష్ట్రంలో గల 10 జిల్లాలకు బీజు యువ జనతాదళ్ అధ్యక్షుల నియమక ప్రక్రియ పూర్తయింది. కొత్తగా నియమితులైన అధ్యక్షుల వివరాలను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శంఖభవన్ కార్యాలయం నుంచి ఆదివారం విడుదల చేశారు. ఇందులో భాగంగా రాయగడ జిల్లాకు దీరేంద్ర పాణిగ్రహి నియమితులయ్యారు. దేవఘర్ జిల్లాకు ప్రతాప్ కుమార్ దేవ్, గజపతి జిల్లాకు లెంకా సింహాద్రి, ఝార్సుగుడకు రాబిన్ పాడీ, కంధమాల్‌కు రాకేష్ కుమార్ మిశ్రా, కేంఝర్‌కు రాకేష్ కుమార్ రామ్, నయాఘడ్‌కు దుర్యోధన్ బెహరా, సంబల్‌పూర్‌కు ప్రదొష్ మహంతి, సువర్ణపూర్‌కు అశోక్ నందా, సుందర్‌ఘడ్ జిల్లాకు సయ్యద్ శబాజ్ హుస్సేన్‌లు నియమితులైనట్లు పేర్కొన్నారు. రాయగడ జిల్లాకు బిజు యువ జనతాదళ్ అధ్యక్షుడిగా నియమితులైన దీరేంద్ర పాణిగ్రహికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక, కార్యకర్తలు, నాయకులు అభినందించారు.
పర్లాకిమిడిలో హిందూ సమ్మేళనం
పర్లాకిమిడి: హిందువులు అంతా ఒక వైపు తమ సంప్రదాయలు కపాడుకుంటూ.. మరోవైపు ఇతర మతాలకు పరివర్తన కాకుండా జాగృతంగా ఉండాలని మహాంత ప్రియ సరంజి మహారాజ్ అన్నారు. స్థానిక డోలాట్యాంకు రోడ్డు దండుమాల వీధి వద్ద హిందూ సమ్మేళనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఇందులో వందలాది మంది పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం జరుపుకున్నారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ గజపతి జిల్లా కన్వీనరు అనాది పాణిగ్రాహి అధ్యక్షత వహించగా మహాంత ప్రియ సరంజి మహారాజ్, సెంచూరియన్ వర్సిటీ అధ్యాపకులు ఎం.జీవరత్నం, భజరంగ్ దళ్ పట్టణ నాయకులు మనోజ్ దాస్, జగన్నాధ మహాపాత్రో, రవీంద్ర భుయ్యాన్ మాట్లాడారు. బాలక్రిష్ణ జెన్నా సభకు సహకరించారు.
జర్నలిస్టుల వనసమారాధన
జర్నలిస్టుల వనసమారాధన
జర్నలిస్టుల వనసమారాధన


