ఓటు విలువ తెలుసుకోవాలి
పర్లాకిమిడి: ఓటు విలువను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. స్థానిక అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్‌లో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. తొలుత రాజావారి ప్యాలస్ నుంచి ఓటరు చైతన్య ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఓటరు దినోత్సవం వేడుకల్లో ఏడీఎం ఫల్గునీ మఝి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డిప్యూటీ కలెక్టర్ మనోజ్‌కుమార్ పట్నాయక్, డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి సుస్మితా మఝి, పురపాలక సంఘం కార్యనిర్హాహక అధికారి లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొని ఓటరు హక్కులను తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీ పండా ఓటు హక్కును దుర్వినియోగం చేయరాదని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మోహానా బీడీవో రాజీవ్ దాస్, గుసాని సమితి బీడీవో గౌరచంద్ర పట్నాయక్‌లకు అధికారులు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నూతనంగా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు విలువ తెలుసుకోవాలి
ఓటు విలువ తెలుసుకోవాలి
ఓటు విలువ తెలుసుకోవాలి


