అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ఇచ్ఛాపురం రూరల్: కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ దళితవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందరివాడన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, నవభారత రాజ్యాంగ నిర్మాతగా ప్రతీ గ్రామంలో ఆయన విగ్రహం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర బీసీ విభా గం కార్యదర్శి నర్తు నరేంద్ర, ఇచ్ఛాపురం, కంచిలి ఎంపీపీలు బోర పుష్ప, పైలా దేవదాసురెడ్డి, జెడ్పీ టీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, డీసీఎంఎస్ మాజీ చైర్‌పర్సన్ సల్ల సుగుణ, దళిత సంఘ నాయకులు సల్ల దేవరాజు, నగిరి మోహనరావు, బాగ మోహనరావు, బాగ జయపతి, సర్పంచ్ గుజ్జు ఢిల్లీరావు, మాజీ ఎంపీపీలు కారంగి మోహనరావు, దక్కత ఢిలీరావు, దళిత సాహిత్య గాయకురాలు కె.దమయంతి పాల్గొన్నారు.
మందస: హరిపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను రిటైర్డు ఉపాధ్యాయుడు నల్ల హడ్డి మాస్టార్ ఆధ్వర్యంలో సోమవారం సత్కరించి గౌరవించారు. పిల్లలను సర్కార్ బడు ల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సుమారు 200 మంది విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బ్యాగులను వితరణ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఎస్.విజయ్, కొర్ల విశ్వనాథం, చింతాడ కోదండరావు, దువ్వాడ దామోదరం, కొంచాడ కన్నయ్య, పుల్ల వాసుదేవ్‌రావు, డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు, గోలుసు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కిడ్నీరోగికి ఆర్థిక సాయం
కవిటి: కె.కపాసుకుద్ధికి చెందిన బొంతల నీలవేణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన శ్రీరామలింగేశ్వర యూత్ సభ్యులు రూ.16,720 సేకరించా రు. ఈ మొత్తాన్ని బాధితురాలికి సోమవారం అందజేసి వైద్య ఖర్చులకు ఉపయోగించాలని కోరారు.


