గణతంత్ర వేడుకల్లో అపశృతి
భువనేశ్వర్: జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ కుజంగ్ ప్రాంతంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను అవనతం చేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో ఒక విద్యార్థి మృతి చెందడంతో విషాదం అలముకుంది. పారాదీప్ కుజంగ్‌లోని ఒక కోచింగ్ సెంటర్ పైకప్పుపై విద్యుదాఘాతం కారణంగా ఒక విద్యార్థి మరణించినట్లు సమాచారం. సూర్యాస్తమయానికి ముందు జెండాను దించుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. జెండాకు అనుసంధానించబడిన జీఐ రాడ్ పైకప్పు పైన ఉన్న విద్యుత్ తీగపై పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.
మరణించిన వ్యక్తి 10వ తరగతి విద్యార్థి ఓం ప్రకాష్ ద్వివేదిగా పేర్కొన్నారు. స్వస్థలం కేంద్రాపడా జిలా టెరగాంవ్. అతను కుజాంగ్ సమగుల్‌లో తన మేనమామ ఇంట్లో ఉంటు పదో తరగతి చదువుతున్నాడు.
రిమ్స్‌లో అన్నదానానికి విరాళం
శ్రీకాకుళం కల్చరల్: గార మండలం గోరువానిపేట సత్యసాయి భజన మండలి నిర్వాహకులు సత్యసాయి నిత్య అన్నపూర్ణ సేవా సంఘం (రిమ్స్ హాస్పిటల్)కు క్వింటా బియ్యం, రూ.1000 విరాళం సోమవారం అందజేశారు. మధ్యాహ్నం నారాయణ సేవ నిర్వహించారు.
రిమ్స్‌లో 53 మందికి అవార్డులు
శ్రీకాకుళం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ సోమవారం 53 మంది ఉద్యోగులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
విద్యార్థులకు ప్రోత్సాహం
గార: శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్‌క్రాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు 1985–86 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా విద్యాసామగ్రి కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎంకే దేవరాణి, పూర్వవిద్యార్థులు బరాటం తిరుపతిరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, తవిటమ్మ, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
శాలిహుండం యాత్రకు ఏర్పాట్లు
గార: శాలిహుండంలో గురువారం జరగనున్న జాతరలో స్వామివారిని భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ కె.పైడపునాయుడు అన్నారు. సోమవారం శాలిహుండం కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, మెట్ల మార్గం, చక్రతీర్ధ స్నానం జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి, పాలకమండలి సభ్యులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు, కొంక్యాన ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, గిరియాత్ర నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి సురేష్ తెలిపారు.
మందస: ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ సంఘటన భిన్నాలి మదనాపురం వద్ద జాతీ య రహదారి సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌కే సైనార్ ఇస్లాం తన భార్యను తీసుకురావడానికి కారులో భువనేశ్వర్ నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న సైనార్ ఇస్లాం చెల్లి సబినా బీబీ, పిల్లలకు స్వల్ప గాయాలయ్యా యి. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గణతంత్ర వేడుకల్లో అపశృతి
గణతంత్ర వేడుకల్లో అపశృతి
గణతంత్ర వేడుకల్లో అపశృతి


