పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు
అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం డివిజన్‌కు అవార్డులు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విశాఖపట్నం విద్యుత్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ మేరకు శ్రీకాకుళం డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావుకు, టౌన్ డి–1 (అరసవల్లి సెక్షన్) ఏఈఈ జావాన సురేష్‌కుమార్‌లకు సీఎండీ పృథ్వీతేజ్ అవార్డులను, ప్రశంశా పత్రాలను బహుకరించారు. ఈ అవార్డులపై జిల్లా సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, శ్రీకాకుళం డివిజన్ ఈఈ పైడి యోగేశ్వరరావులు ప్రత్యేకంగా అభినందించి హర్షం ప్రకటించారు.
పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు


