క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కంచిలి: క్రీడాస్ఫూర్తి ఉన్నవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి అన్నారు. మకరాంపురంలో కొద్దిరోజులుగా నిర్వహించిన ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతగా ప్రసాద్ లెవెన్ జట్టు, రన్నర్‌గా సీఎస్‌ఎం లెవెన్ జట్టు నిలిచాయి. వీరికి అతిథులు చేతులమీదుగా ట్రోఫీలతోపాటు విన్నర్ జట్టుకు రూ. 50 వే లు, రన్నర్ జట్టుకు రూ. 40 వేలను అందజేశా రు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా డి.నవీన్(ఆర్‌బీఎం లెవెన్ జట్టు), బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ యాదవ్ (సీఎస్‌పీ లెవెన్ జట్టు), బెస్ట్ బౌలర్ గా రామయ్య (ప్రసాద్ లెవెన్ జట్టు)కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండ ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీనియర్ క్రికెటర్ వజ్జ మృత్యుంజయరావు, పార్టీ నాయకుడు ఇప్పిలి క్రిష్ణారావు, సీనియర్ క్రికెటర్, కవిటి మండల వైఎస్సార్‌సీపీ నేత కడియాల ప్రకాశ్, మండల టీడీపీ అధ్యక్షుడు మాదిన రామారావు, వైఎస్సార్‌సీపీ యువనేత, క్రికెటర్ నర్తు శివాజీ, సీనియర్ క్రికెటర్ బెందాళం శోభన్‌బాబు, గొండ్యాల రమణ పాల్గొన్నారు.


