ఉత్సాహంగా మినీ మారథాన్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని స్టేడియం నుంచి మాల్యవంత్ హోస్టల్ వరలకు ఆదివారం మినీ మారథాన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. తొలుత మారథాన్‌ను జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ జెండా ఉపి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జనవరి నెల చివరి ఆదివారం రోజున కిట్–కిస్ సంస్థ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవానికి ముందుగానే ఈ సాముహిక పరుగును నిర్వహించారు. అందరికీ విద్య నినాదంతో 2026 జనవరి 25న ఒడిశాలోని అన్ని జిల్లాల్లో.. అలాగే భారతదేశంలోని మెట్రో నగరాలలో మినీ మారాథాన్‌ను నిర్వహించారు. అందరికీ విద్య లక్ష్యంగా అవగాహన కార్యక్రమం, సామాజిక చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో కిట్–కిస్, కిమ్స్ సంస్థల స్థాపకులు డాక్టర్ ఆచ్యుత సమంత 2016 నుంచి ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య అనేది పిల్లల మూడవ కన్నని ఆయన అభిప్రాయం. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకుడదన్నదే డాక్టర్‌ఆచ్యుత్ సమంత లక్ష్యం అని అన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మల్కన్‌గిరి సమాజసేవకులు రత్నాకర్ దాస్, కనక న్యూస్ బ్యూరో హెడ్ దేభబ్రత సానా, ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ్ ముదిలి, శ్యామ్ సుందర్ నాయక్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా మినీ మారథాన్
ఉత్సాహంగా మినీ మారథాన్


